KMR: న్యాయ సేవ అథారిటీకి సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్‌ను విస్తృతంగా ప్రసారం చేయాలని జిల్లా కోర్టు న్యాయమూర్తి నాగరాణి చెప్పారు. జిల్లా న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో 15100 టోల్ ఫ్రీ నంబర్ గోడప్రతులను ఆమె విడుదల చేశారు. అనంతరం కోర్టులైజనింగ్ అధికారులకు అందజేశారు. ఇట్టి టోల్ ఫ్రీ నంబర్‌ను పోలీస్ సిబ్బంది ప్రజలకు తెలిసే విధంగా ప్రచారం చేయాలని ఆమె సూచించారు.