SRD: సంగారెడ్డి పట్టణంలోని టీఎన్జీవో కార్యాలయంలో ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కేంద్రాన్ని జిల్లా అధ్యక్షుడు జావిద్ అలీ సోమవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు హక్కును ఈ కేంద్రంలో నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కసిని శ్రీకాంత్ పాల్గొన్నారు.