KMM: ఇటీవల ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో వరద బాధితులకు చేతన ఫౌండేషన్ ద్వారా అందించిన సేవలు అభినందనీయమని రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క కొనియాడారు. చేతన ఫౌండేషన్ చైర్మన్ వెనిగళ్ల రవికుమార్ రేణుక దంపతుల ఆధ్వర్యాన సభ్యులు హైదరాబాద్‌లో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆమె వరదల సమయాన బాధితులకు చేసిన సేవలను అభినందించి, భవిష్యత్‌లోనూ సేవలందించాలని సూచించారు.