జగిత్యాల జిల్లా కోరుట్ల విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయంలో జూనియర్ అకౌంటు ఆఫీసర్ గా కె. ప్రసాద్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఏఏఓ భూమయ్యను కలిసి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు. అనంతరం విద్యుత్ ఉద్యోగులు, నాయకులు జేఏఓ ప్రసాద్‌ను శాలువాలతో సన్మానించారు. శాఖపరంగా వినియోగదారులకు సేవలందిస్తామని జేఏఓ ప్రసాద్ పేర్కొన్నారు.