NGL: కట్టంగూరు తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి ధరణి, ఆదాయ, కుల ధ్రువపత్రాల జారీ, తదితర అంశాలపై తహసీల్దార్, సిబ్బందితో సమీక్షించారు. తహసీల్దార్ కార్యాలయ పరిసరాలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. సంవత్సరానికి మించి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.