JN: దేవరుప్పుల మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించిన తర్వాతే ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు వేయాలని కోరుతూ.. మండల బీఆర్ఎస్ నేతలు ఎమ్మార్వో, ఎంపీడీవోకు బుధవారం వినతి పత్రం అందించారు. గ్రామ సభలు నిర్వహించకుండానే కమిటీలు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. దీంతో అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. సమస్యను పరిష్కరించాలన్నారు.