NZB: అల్పపీడనం 5 రోజుల తుపాను నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా రైతులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. వరి ధాన్యం కొనుగోలు పూర్తి కాకపోవడంతో తుపాను వల్ల ధాన్యం తడిసి నష్టం జరిగే అవకాశం ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు కొనుగోలు త్వరితగతిన చేపట్టడంతో పాటు ధాన్యం తడవకుండా ఉండేందుకు టార్పాలిన్ కవర్లను అందించాలని రైతులు కోరుతున్నరు.