నల్గొండ: అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు పోగుల ఆంజనేయులు అన్నారు. సోమవారం తుర్కపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్ల పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని హైదరాబాదులో నిర్వహిస్తున్న ధర్నాకు వెళ్లకుండా ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు.