NRPT: ఈ నెల 28 న నారాయణపేట, కోస్గి కోర్టులలో నిర్వహించే లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మొహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. మంగళవారం జిల్లా కోర్టులో పోలీస్, కోర్టు అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. లోక్ అదాలత్ కార్యక్రమంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని చెప్పారు.