వికారాబాద్: సమాజ మార్పులో భాగంగా ప్రజల్లో సమానత్వాన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పీకర్ గడ్డం ప్రాసాద్ కుమార్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధ్యక్షన నిర్వహించారు. స్పీకర్ మాట్లాడుతూ.. నేర ప్రవృత్తి, వివక్షకు తావులేని సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.