MDK: జిల్లాలోని గిరిజన గురుకుల సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో ఎంపీసీఎస్, బీజెడ్సీ, ఎంజెడ్సీ, బీఏ, బీకాం గ్రూప్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఉమాదేవి ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థినీలు ఈ నెల 27వ తేదీ లోగా దరఖాస్తు చేసుకుని కళాశాలలో సంప్రదించాలని సూచించారు. వివరాలకు 7901097706 నంబర్లో సంప్రదించాలన్నారు.