HYD: ట్రేడింగ్ పెట్టుబడుల పేరుతో మోసగించిన నలుగురిని సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రేడింగ్ పేరుతో రూ. 5.27 కోట్లు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు మురళీకృష్ణన్, రవీందర్రెడ్డి, రవి, మాధవరావులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ల్యాప్ట్యాప్లు, చెక్బుక్లు, ఏటీఎం కార్టులు స్వాధీనం చేసుకున్నారు.