HNK: చెప్పులు కుట్టే చర్మకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కుల వివక్ష పోరాట సమితి జిల్లా కార్యదర్శి మంద సంపత్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. చెప్పులు కుట్టే వారికి అడ్డాలలో షెడ్స్ నిర్మించి ఇవ్వాలని, వారి పిల్లలకు ఉచిత విద్యను అందించి ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.