HYD: యాకుత్పురా నియోజకవర్గ పరిధి కురుమగూడ డివిజన్లో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ పర్యటించారు. మజీద్ ఏ హాజరియా ఏరియాలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం తదితర మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.