RR: సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ నిమజ్జన వేడుకల్లో దళిత మహిళపై జరిగిన దాడిని ఖండిస్తూ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య దళిత సంఘ నాయకులతో కలిసి ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్యని కలిసి ఫిర్యాదు చేశారు. దళిత మహిళపై దాడి చేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టి అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.