»Realme Launches New Coca Cola Smart Phone In India
Coca Cola Phone : కొకకోలా నుంచి స్మార్ట్ ఫోన్.. భారత్లో లాంచ్.. ధరెంతో తెలుసా?
రియల్ మీ 10 ప్రో కొకకోలా ఎడిషన్ పేరుతో తాజాగా భారత్ లో ఈ ఫోన్ ను లాంచ్ చేశారు. ఈ ఫోన్ లో అత్యాధునికమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ తో పాటు చార్జర్, కేబుల్ ను కూడా అందిస్తారు. రెగ్యులర్ రియల్ మీ 10 ప్రోలాగానే ఈ ఫోన్ లో ఫీచర్స్ ఉండనున్నాయి.
Coca Cola Phone : కొకకోలా అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి.. చల్లని కూల్ డ్రింక్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికెళ్లినా కనిపించే కూల్ డ్రింక్ బ్రాండ్ ఇది. ముఖ్యంగా వేసవికాలంలో మనకు ఇది గుర్తొస్తుంది. కాస్త ఎండలో తిరిగితే చాలు.. కూల్ డ్రింక్ తాగుతాం. దశాబ్దాలుగా కొకకోలా ఇండియన్స్ కు కూల్ డ్రింక్ ద్వారా దగ్గరయింది. కానీ.. ఇప్పుడు అదే కూల్ డ్రింక్ కంపెనీ కొత్త రంగంలోకి అడుగుపెట్టింది. అదే స్మార్ట్ ఫోన్ రంగం. అసలు.. స్మార్ట్ ఫోన్ల తయారీకి, కొకకోలా కంపెనీకి ఏమైనా సంబంధం ఉందా.. లేదు కదా. కానీ.. ఈ కంపెనీ మాత్రం ఏకంగా స్మార్ట్ ఫోన్ల తయారీ రంగంలోకి దూకేసింది. దూకేయడమే కాదు.. రియల్ మీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని ఏకంగా ఒక స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసేసింది.
రియల్ మీ 10 ప్రో కొకకోలా ఎడిషన్ పేరుతో తాజాగా భారత్ లో ఈ ఫోన్ ను లాంచ్ చేశారు. ఈ ఫోన్ లో అత్యాధునికమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ తో పాటు చార్జర్, కేబుల్ ను కూడా అందిస్తారు. రెగ్యులర్ రియల్ మీ 10 ప్రోలాగానే ఈ ఫోన్ లో ఫీచర్స్ ఉండనున్నాయి. రియల్ మీ 10 ప్రో డిసెంబర్ లో లాంచ్ అయిన విషయం తెలిసిందే.
Coca Cola Phone : రియల్ మీ 10 ప్రో కొకకోలా స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఇవే
ఒకే వేరియంట్ లో 8 జీబీ ర్యామ్ తో లాంచ్ అయిన ఈ ఫోన్ ధర రూ.20,999 గా ఉంది. ఒరిజినల్ రియల్ మీ 10 ప్రో ధర 6 జీబీ వేరియంట్ కు రూ.18,999 కాగా, 8 జీబీ వేరియంట్ కు రూ.19,999 గా ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 108 ఎంపీ కెమెరా, 6.72 ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్, 5జీ నెట్ వర్క్, 3.5 ఆడియో జాక్, యూఎస్బీ సీ పోర్ట్, 33 వాట్స్ చార్జింగ్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ విడుదలైంది. యూత్ ను ఆకట్టుకోవడం కోసం రియల్ మీ 10 ప్రో ఫోన్ డిజైన్ ను కొత్త లుక్ తో కొన్ని అదనపు ఫీచర్లను యాడ్ చేసి కొకకోలా ఎడిషన్ ను లాంచ్ చేశారు.