న్యూజిలాండ్‌పై తొలి టెస్టు మ్యాచ్‌లో ఓటమి పాలైన భారత్.. రెండో టెస్టులో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్ రేసులో నిలవడానికి టీమిండియాకు పూణె టెస్టు కీలకం కానుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్ బలమైన స్పిన్ వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. దీంతో రెండో టెస్టు కోసం క్యూరేటర్లు స్లో టర్నింగ్ పిచ్ తయారు చేసినట్లు సమాచారం.