ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ప్రవేశపెట్టిన తర్వాత వరుసగా 2 సార్లు ఫైనల్ చేరిన టీమిండియా ముచ్చటగా మూడోసారి ఫైనల్ బెర్త్ దక్కించుకోవాలని ఆరాటపడుతోంది. అయితే ప్రస్తుతం పాయింట్ల టేబుల్లో అగ్రస్థానంలో ఉన్న భారత్.. వరుసగా 2 టెస్టులు ఓడిపోయి ఇరకాటంలో పడింది. ఫైనల్ చేరాలంటే మిగతా 6 టెస్టులలో తప్పనిసరిగా 4 గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. న్యూజిలాండ్తో 1, ఆస్ట్రేలియాతో 5 టెస్టులు రోహిత్ సేన ఆడాల్సి ఉంది.