Video Viral: కొత్త జెర్సీల్లో మెరిసిన టీమిండియా క్రికెటర్లు
కొత్త జెర్సీల్లో భారత్ క్రికెటర్లు మెరిశారు. మరో ఐదేళ్లకు బీసీసీఐతో అడిడాస్ కంపెనీ జెర్సీ స్పాన్సర్‌గా అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో తమ లోగోతో కొత్త జెర్సీలను విడుదల చేసింది.
టీమిండియా(Team India) క్రికెటర్లు కొత్త జెర్సీ(New Jersey)ల్లో మెరిశారు. భారత జాతీయ జట్టు జెర్సీ స్పాన్సర్‌గా అడిడాస్ కంపెనీ(Adidas company) నిలిచింది. ఈ సందర్భంగా కొత్త జెర్సీల్లో పురుషులు, మహిళలు సందడి చేశారు. మూడు ఫార్మాట్లలో భారత క్రికెటర్లు(Indian Cricketers) సందడి చేయనున్నారు. మొన్నటి వరకూ కూడా బైజూస్ కంపెనీ(Bijus Company) స్పాన్సర్‌గా ఉండేది. ఇప్పుడు ఆ కంపెనీ స్థానంలో అడిడాస్ నిలిచింది.
అడిడాస్ కంపెనీ(Adidas company) ఐదేళ్ల పాటు భారత జట్టు క్రికెటర్లకు జెర్సీ స్పాన్సర్ చేయనుంది. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో బీసీసీఐ(BCCI)కి అడిడాస్ సంస్థ రూ.350 కోట్లను చెల్లించనుంది. అడిడాస్ లోగోలతో డిజైన్ చేసిన జెర్సీలను బీసీసీఐ విడుదల చేసింది. క్రికెటర్లు కొత్త జెర్సీలు(New Jersey) ధరించి సందడి చేశారు.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma), విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్, హార్దిక్ పాండ్యాతో పాటు మహిళా క్రికెటర్లు హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన(Smriti mandanna) కొత్త జెర్సీలు ధరించిన ప్రత్యేక వీడియో(Video)ను బీసీసీఐ(BCCI) సోషల్ మీడియాలో షేర్ చేసింది. వన్డే ఫార్మేట్లలోని బ్లూ జెర్సీలో భుజాలపై తెల్లటి స్ట్రిప్స్ వేయగా టెస్టు జెర్సీలో భుజాలపై బ్లూ స్ట్రిప్స్ వేశారు. ఇక టీ20(T20) ఫార్మాట్‌కు ఎప్పటిలాగే రౌండ్ నెక్ టీషర్ట్ ఉంది. అండర్ 19 క్రికెటర్ల నుంచి సీనియర్ జట్టు వరకూ ఇకపై పురుషులు, మహిళా క్రికెటర్లు కొత్త జెర్సీల్లో కనిపించనున్నారు.