Rohit Sharma: టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే హిట్ మ్యాన్‌కు పోలీసులు షాక్ ఇచ్చారు. బంగ్లాదేశ్‌తో గురువారం జరిగే మ్యాచ్ కోసం స్పోర్ట్స్ కారులో ముంబాయి నుంచి పుణే వెళ్లాడు. హైవేపై అతివేగంతో వెళ్లడంతో ట్రాఫిక్ పోలీసులు రోహిత్‌కు మూడు చలాన్లు వేశారు. మైదానంలో చూపించిన స్పీడ్.. రోడ్డుపై కారు డ్రైవింగ్‌లో చూపించడం చిక్కుల్లో పడ్డాడు. హైవేపై గంటకు 200 కి.మీ వేగంతో కారు నడుపుతూ సీసీ కెమెరాల్లో చిక్కాడు. ఒకానొక దశలో రోహిత్ కారు గంటకు 215 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. రూల్స్ ఎవరికైనా ఒకటే అని పోలీసులు రోహిత్ కారుపై మూడు చలానాలు విధించింది.
కారులో ఇలా హై స్పీడ్‌లో ప్రయాణించడం కంటే టీమ్ బస్‌లో వెళ్తే బాగుండేదని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ విషయంపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. టీమ్ ఇండియా క్రికెటర్‌ను కూడా వదల్లేదని, మరికొందరు మైదానం అయిన రోడ్డు అయిన రోహిత్ తగ్గేదేలే అని అంటున్నారు. ఏది ఏమైనా సేఫ్ డ్రైవింగ్ చేయమని రోహిత్ అభిమానులు కోరుతున్నారు.