అంతర్జాతీయ T20ల్లో జింబాబ్వే ప్రపంచ రికార్డ్ సృష్టించింది. గాంబియాతో జరిగిన T20 ప్రపంచ కప్ క్వాలిఫయర్ మ్యాచ్లో జింబాబ్వే 20 ఓవర్లలో 344/4 పరుగులు చేసింది. దీంతో T20ల్లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా జింబాబ్వే రికార్డ్ సృష్టించింది. అంతేకాకుండా ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు (27) కొట్టిన జట్టుగా నిలిచింది. కాగా, ఈ మ్యాచ్కు ముందు T20ల్లో అత్యధిక పరుగుల రికార్డ్ నేపాల్ (314/3) పేరుతో ఉండేది.