»Srilanka Rammed Into Super 6 Of Worldcup Qualifiers Beatin Ireland By Huge Margin
Wanindu Hasaranga: నయా రికార్డ్ నెలకొల్పిన శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ.. 5 వన్డేల్లో 22 వికెట్లు
శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ అరుదైన రికార్డు నెలకొల్పాడు. వరుసగా ఐదు వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించాడు. హసరంగ 5 వన్డేల్లో 22 వికెట్లు పడగొట్టాడు.
Wanindu Hasaranga: ప్రస్తుతం క్రికెట్ వరల్డ్ కప్ క్యాలిఫయర్స్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఈ టోర్నీలో శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ అరుదైన రికార్డు నెలకొల్పాడు. వరుసగా ఐదు వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించాడు. హసరంగ 5 వన్డేల్లో 22 వికెట్లు పడగొట్టాడు. దాంతో పాకిస్థాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ 33 ఏళ్ల క్రితం నెలకొల్పిన రికార్డును సమం చేశాడు. కాగా, 10 ఓవర్లు వేసిన హసరంగ 79 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. అంతేకాదు వరుసగా మూడు వన్డేల్లో ఐదేసి వికెట్లు తీసిన మొట్ట మొదటి స్పిన్నర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.
వరుసగా మూడు విజయాలతో విజయాలతో క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో శ్రీలంక జట్టు Super Sixకి వెళ్లింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ జట్టును 133 పరుగుల తేడాతో ఓడించింది. ఈ ఓటమితో క్వాలిఫయర్స్ రేస్ నుంచి ఐర్లాండ్ జట్టు తప్పుకుంది. 5 వికెట్లతో శ్రీలంక బౌలర్ హసరంగ ఐర్లాండ్ పతనాన్ని శాసించాడు. హసరంగకు ఇది వరుసగా మూడోసారి 5 వికెట్ల ఘనత కావడం విశేషం. వన్డేల్లో ఈ ఘనత సాధించిన బౌలర్లలో హసరంగా రెండవ బౌలర్ మాత్రమే. ఇంతకు ముందు పాక్ బౌలర్ వకార్ యూనిస్ పేరిట ఉండేది. ఐర్లాండ్ ఆటగాళ్లు ఆండ్రూ బాల్బ్రిన్, హ్యారీ టెక్టార్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, జోష్ లిటిల్‌లను ఔట్ చేసి వనిందు హసరంగా ఈ రికార్డు సాధించాడు. వన్డేల్లో మొదటి సెంచరీ సాధించిన శ్రీలంక కెప్టెన్ కరుణరత్నేకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. 326 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో ఐర్లాండ్ లక్ష్యాన్ని సాధించడంలో చతికిలా పడింది.
ఆట మొదట్లోనే మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో తర్వాత వచ్చిన ఆటగాళ్లను కట్టడి చేయం శ్రీలంకకు సులభమైంది. 31 ఓవర్లలో 192 పరుగులే చేయగలిగింది. మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన శ్రీలంక కెప్టెన్ కరుణరత్నే 103 పరుగులతో సెంచరీ చేయడంతో భారీ స్కోర్ దిశగా జట్టు సాగింది. సెంచరీ అనంతరం ధాటిగా ఆటడానికి ప్రయత్నించి 38వ ఓవర్లో అవుటయ్యాడు. వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో గ్రూప్-బీ నుంచి శ్రీలంకతో పాటు స్కాట్లాండ్, ఒమన్‌లు సూపర్ సిక్స్‌కి చేరుకున్నాయి. గ్రూప్-ఏ నుంచి వెస్టిండీస్, జింబాబ్వే, నెదర్లాండ్ అర్హత సాధించాయి.