బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ నిలకడగా ఆడుతుంది. మూడో రోజు టీ బ్రేక్ సమయానికి భారత్ 57/0 పరుగులు చేసింది. భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ(27*), యశస్వి జైస్వాల్(29*) ధాటిగా ఆడుతున్నారు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 299 పరుగులు వెనుకబడి ఉంది.