ఇంకొన్ని రోజుల్లో వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఐసీసీ లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేపింది. ఎమిరేట్స్ టీ10లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు భారత సహ యజమానులు పరాగ్ సంఘ్వీ, క్రిషన్ కుమార్ చౌదరితో సహా 8 మంది ఆటగాళ్లు, అధికారులపై ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) తరపున ఐసీసీ పలు ఆరోపణలు చేసింది.
Eight players and officials face charges for violating ECB's Anti-Corruption Code.
పరాగ్ సంఘ్వీ, క్రిషన్ కుమార్ చౌదరిలు ఇద్దరూ పూణే డెవిల్స్ జట్టు సహ యజమానులుగా ఉన్నారు. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం బంగ్లాదేశ్ మాజీ ఆల్ రౌండర్ నాసిర్ హుస్సేన్ సహా మొత్తం 8 మంది పేర్లను ఆ నివేదికలో చేర్చారు. అబుదాబి T-10 లీగ్ 2021 ఎడిషన్‌లో ఎన్నో అవకతవకలు జరిగాయని, కొందరు ఆటగాళ్లకు బహుమతులు చాలా అందాయని తేలింది. దీంతో మొత్తం 8 మందిని ఐసీసీ సస్పెండ్ చేసింది.