తమ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న రాహుల్ సోరెంగ్ విజయ్ మర్చంట్ ట్రోఫీ ఆడే జట్టుకు ఎంపిక కావడం గర్వంగా ఉందని.. దిగ్గజ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. రాహుల్.. పుల్వామా ఘటనలో నింగికేగిన అమర వీరుడు విజయ్ సోరెంగ్ కుమారుడు. కాగా, కశ్మీర్లో 2019లో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల పిల్లలకు తన పాఠశాలలో సెహ్వాగ్ ఉచితంగా విద్యనందించాడు.