IPL 2023 : సునీల్ గవస్కర్ గుండెల మీద ధోనీ ఆటోగ్రాఫ్
ధోనికి ఈ సీజన్ చివరిదని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన అభిమానులతో పాటు క్రికెట్ ప్రేమికులు కూడా ఆందోళన చెందుకున్నారు. ఒకవేళ ఇదే చివరిదైతే ధోనీని మరోసారి మ్యాచ్ లో చూసే అవకాశం ఉండకపోవచ్చు.
2023 ఐపీఎల్ ( IPL 2023 ) సీజన్ మ్యాచ్ లు చివరి దశకు చేరాయి. చెన్నై హోం గ్రౌండ్స్ లో CSK చివరి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో కొల్ కతా నైట్ రైజర్స్ సీఎస్కే పై విజయం సాధించింది. అయితే ఇప్పటికీ CSK కు ప్లే ఆప్స్ అవకాశాలు సజీవంగానే ఉన్నాయి. కెప్టెన్ మహైంద్ర సింగ్ ధోనీకి ఈ ఏడాదే చివరి సీజన్ అని వార్తలు వినిపిస్తున్నాయి. హోం గ్రౌండ్స్ లో CSKను సపోర్ట్ చేయడానికి చెన్నై వాసులు అధికంగా తరలివచ్చారు. మ్యాచ్ అనంతరం CSK జట్టు సభ్యులు మైదానమంతా కలియతిరిగారు. జెండాలను అభిమానుపై విసురుతూ ప్రేమను చాటుకున్నారు. ఈ మ్యాచ్ లో సీఎస్కే ఓడిపోయినప్పటికీ అభిమానులతో CSK జట్టు ఏర్పరుచుకున్న బాండ్ మాత్రం ఆకట్టుకుంది.
ధోనీకి ఇదే సీజన్ చివరిదని వస్తున్న వార్తలపై ఆయన అభిమానులు బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మ్యాచ్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ గ్రౌండ్ లోకి వచ్చి తన గుండెల మీద ఎంఎస్ ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. ఈ ఘటన క్రికెట్ అభిమానులను షాక్ కు గురిచేసింది. ఎందుకంటే గవస్కర్ ధోనీ కంటే చాలా సీనియర్ క్రికెటర్. భారత్ కు మొదటి ప్రపంచకప్ అందించిన టీంలో ఆయన ముఖ్యమైన ప్లేయర్. అలాంటి దిగ్గజ క్రికెటర్ తనకన్నా జూనియర్ దగ్గరికి వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకోవడం… అదీ గుండెలమీద కావడంతో క్రికెట్ ప్రియులతో పాటు మామూలు జనాన్ని కూడా ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేసింది.
గవస్కర్ మాట్లాడుతూ “వచ్చే మ్యాచ్ ల నుంచి నాకు మరో పింక్ షర్ట్ ఇవ్వండి” అని అన్నారు. అయితే ఎంఎస్ ధోనీకి ఇదే చివరి సీజన్ అని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో చెన్నై హోం గ్రౌండ్స్ వేదికగా ఆఖరి మ్యాచ్ అవడంతో అభిమానులు బావోద్వేగానికి గురయ్యారు. తదుపరి మ్యాచ్ ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్ లో చెన్నై ఆడనుంది. ఇప్పటివరకు 13 మ్యాచ్ లు ఆడిన చెన్నై 15పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.