బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మెరుగ్గా రాణిస్తున్నాడు. ఓపెనర్‌గా తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాడు. అలాగే, 2020 నుంచి దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై రోహిత్, కోహ్లీ, పంత్ కంటే మెరుగైన సగటు రికార్డు నమోదు చేసుకున్నాడు. గబ్బా టెస్టులోనూ కోహ్లీ, రోహిత్ కంటే మెరుగైన టెక్నిక్ ప్రదర్శించాడు. 139 బంతుల్లో 84 పరుగులు చేసిన రాహుల్.. సెంచరీ మిస్ చేసుకున్నాడు.