ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంచనాలకు తగ్గట్లు ఆడట్లేదు. దీని ప్రభావం వారి ఐసీసీ ర్యాంకులపై పడింది. తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో రోహిత్ ఆరు స్థానాలు దిగజారి 31వ స్థానానికి పరిమితమయ్యాడు. కోహ్లీ ఐదు స్థానాలు డౌన్ అయి 20వ ర్యాంకులో నిలిచాడు. ఇక.. జో రూట్‌ను వెనక్కి నెట్టి హ్యారీ బ్రూక్ అగ్రస్థానంలో నిలిచాడు.