పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ అజామ్‌ను కోహ్లీతో పోలుస్తూ తాను పెట్టిన పోస్టుపై పాక్ క్రికెటర్ ఫకర్ జమాన్ స్పందించాడు. తన ట్వీట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని, PCBని విమర్శించలేదని చెప్పాడు. అది కేవలం తన అభిప్రాయమని, బాబర్‌కు మద్దతుగా పోస్ట్ పెట్టానని తెలిపాడు. కాగా, గతంలో బాబర్‌ను పక్కన పెడుతూ PCB తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ అతను పోస్టు పెట్టాడు.