ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ అండర్-19 క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. ఆసీస్తో జరిగిన తొలి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 225/9 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన భారత్ 30.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. అభిగ్యాన్ (87), వేదాంత్ త్రివేది (61), వైభవ్ సూర్యవంశీ (38) రాణించారు.