టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ తన గర్ల్ ఫ్రెండ్ మేహా పటేల్‌ను పెళ్లి చేసుకున్నాడు. వడోదరలో ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితుల సమక్షంలో వివాహా వేడుక జరిగింది. వధువరులు ఇద్దరు గుజరాతీ సాంప్రదాయం ప్రకారం వస్త్రాలు ధరించారు. పెళ్లి తర్వాత చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతుంది. ‘మాన్ మేరీ జాన్’ అనే పాటకు అక్షర్, మేహా కలిసి స్టెప్పులు వేశారు. వారిని అక్కడున్న వారు ఎంకరేజ్ చేశారు. ముందుగా అక్షర్ పటేల్ బౌలింగ్ వేస్తున్నట్టు, ఆ తర్వాత బ్యాటింగ్ చేసినట్టు యాక్ట్ చేశాడు.
కపుల్స్ డ్యాన్స్ చేయగా.. ఈలలతో ఆ ప్రాంతం హోరెత్తింది. యువ జంటను అందరూ ఉత్సాహ పరిచారు. అంతకుముందు సంగీత్, మెహందీ కూడా జరిగాయి. అప్పుడు కూడా ఇద్దరు కలిసి డ్యాన్స్ చేశారట. పెళ్లి జరిగిన తర్వాత బరాత్‌లో కూడా అక్షర్ పటేల్ చేసిన డ్యాన్స్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. పెళ్లి ఉండటంతోనే కివీస్ సిరీస్‌కు అక్షర్ పటేల్ దూరంగా ఉన్నాడు. ఇటీవల కేఎల్ రాహుల్- అతియా శెట్టి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. టీమిండియా ప్లేయర్స్ ఒక్కొక్కరు వరసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.