ACC ఎమర్జింగ్ ఆసియా కప్-2024లో భాగంగా రేపు టీమిండియా తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ మస్కట్‌లోని అల్ అమెరత్ క్రికెట్ స్టేడియంలో రేపు రాత్రి 7 గంటలకు జరగనుంది. రెండు జట్లకు ఇది మొదటి మ్యాచ్ కావడంతో ఎలాగైనా గెలిచి శుభారంభం చేయాలని చూస్తున్నాయి. భారత్ జట్టుకు తిలక్ వర్మ సారథ్యం వహించనున్నాడు. కాగా ఈ మ్యాచ్‌ను ఫ్యాన్‌కోడ్ యాప్‌లో వీక్షించవచ్చు.