టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం లభించింది. ఆయనకు హాంకాంగ్ జట్టు… ఓ ప్రత్యేకమైన బహుమతి ఇచ్చి కోహ్లీపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇంతకీ మ్యాటరేంటంటే… ప్రస్తుతం టీమిండియా ఆసియా కప్ కోసం పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచుల్లో కోహ్లీ అదరగొడుతున్నాడు. అప్పటి వరకు కోహ్లీ ఫాం కోల్పోయాడు అన్నవారంతా.. కోహ్లీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 35 రన్స్ చేసిన అతడు.. రెండో మ్యాచ్‌లో హాంకాంగ్‌పై 44 బాల్స్‌లో 59 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. ఆరు నెలల తర్వాత టీ20 ఫార్మాట్లో హాఫ్ సెంచరీ చేసిన విరాట్‌పై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అతనితోపాటు సూర్యకుమార్ మెరుపులతో ఈ మ్యాచ్‌లో హాంకాంగ్‌పై 40 రన్స్‌తో ఇండియా గెలిచింది.
అయితే మ్యాచ్‌లో ఓడిపోయినా కూడా హాంకాంగ్ టీమ్ ప్లేయర్స్ ఎంతో గొప్ప మనసు చాటుకున్నారు. మ్యాచ్ తర్వాత తమ అభిమాన క్రికెటర్ విరాట్ కోహ్లికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా? హాంకాంగ్ టీమ్ జెర్సీ. దీనిపై ఓ స్పెషల్ మెసేజ్ కూడా వాళ్లు రాశారు.
“ఓ జనరేషన్‌ను ఇన్స్పైర్ చేసినందుకు థ్యాంక్యూ. మేము నీతోనే ఉంటాము. రానున్నవి చాలా అద్భుతమైన రోజులు. ప్రేమతో టీమ్ హాంకాంగ్” అనే సందేశాన్ని ఆ జెర్సీపై రాసి మ్యాచ్ తర్వాత కోహ్లికి అందించారు. ఈ స్పెషల్ గిఫ్ట్‌పై ఎంతో ఆనందం వ్యక్తం చేసిన విరాట్ కోహ్లి.. తర్వాత ఆ ఫొటోను తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేయడం విశేషం.