వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌లో (World Archery Championships 2023)భారత ఆర్చర్ అదితి స్వామి (Aditi Swami) అదరగొట్టింది.17 ఏళ్లకే అద్భుతంగా రాణించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.ఉమెన్స్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో ప్రత్యర్థి అండ్రీ బెసెర్రాను 149-147తో మట్టికరిపించింది.మెక్సికోకు చెందిన ఆండ్రియా బెకెర్రా(Andrea Becerra)ను ఓడించి స్వర్ణపతకం సాధించింది.అంతకుముందు సెమీఫైనల్లో తన మార్గదర్శి, భారత సీనియర్ ఆర్చర్ వెన్నెం జ్యోతి సురేఖ (Jyothi Surekha Vennam)ను ఓడించి అదితి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక, సెమీస్‌లో ఓడిన జ్యోతి సురేఖ (Jyoti Surekha) మూడో స్థానానికి జరిగిన ప్లేఆఫ్‌లో నెగ్గి కాంస్య పతకం దక్కించుకుంది.
ఉమెన్స్ వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ తన ప్రత్యర్థి టర్నీ క్రీడాకారిణి ఐపెక్ టామ్రుఖ్ను 150-146 తేడాతో విజయం సాధించి రజత పతకం కైవసం చేసుకుంది. మరో భారత ఆర్చర్ పర్ణీత్ కౌర్ క్వార్టర్‌ఫైనల్స్‌లో వెనుదిరిగింది. అంతకు ముందు జ్యోతి, పర్ణీత్ కౌర్, ఆదితి గోపీచంద్ త్రయం 235-229తో డఫ్నే క్వింటెరో, అనా సోఫా హెర్నాండేజ్ జియోన్, ఆండ్రియా బెసెరాల (మెక్సికో) బృందంపై విజయం సాధించి పసిడిని ముద్దాడిన విషయం తెలిసిందే. మొత్తంగా వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్స్ 2023లో భారత్ ఇప్పటి వరకు మూడు మెడల్స్ సాధించింది. ఇందులో రెండు గోల్డ్, ఒకటి బ్రోంజ్ మెడల్స్ ఉన్నాయి.
చదవండి :Hyderabadలో సుప్రీంకోర్టు బెంచ్.. ఎంపీ రంజిత్ రెడ్డి ప్రైవేటు బిల్లు!