మహిళల వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో భారత మహిళా జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అదరగొట్టింది. వన్డేల్లో మూడు స్థానాలు ఎగబాకి రెండో స్థానంలో నిలిచింది. టీ20ల్లో ఒక స్థానం మెరుగై మూడో స్థానానికి చేరింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో మంధాన సూపర్ సెంచరీ (105) చేసింది.