కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియంలోని ఓ స్టాండ్‌కు మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి పేరును పెట్టనున్నారు. బ్లాక్ బీ గ్యాలరీకి ఆమె పేరును పెట్టనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ప్రకటించింది. BCCI, ICC ప్రెసిడెంట్ జగ్ మోహన్ దాల్మియా, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తర్వాత ఈ గౌరవం జులన్‌కు దక్కింది. వచ్చే ఏడాది జనవరి 22న భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగనున్న టీ20 మ్యాచ్ సందర్భంగా దీన్ని ప్రారంభించనున్నారు.