పాకిస్థాన్ స్వదేశంలో 1349 రోజుల తర్వాత తొలి టెస్ట్ విజయం సాధించింది. ముల్తాన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో 152 పరుగుల తేడాతో పాక్ గెలుపొందింది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్థాన్ స్పిన్నర్లు సాజిద్ ఖాన్, నౌమన్ అలీ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి మొత్తం 20 వికెట్లు తీశారు. ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఇలా జరగడం 52 ఏళ్లలో ఇదే మొదటిసారి.