విజయ్ హజారే ట్రోఫీ కోసం మొదటి మూడు మ్యాచ్‌లకు సంబంధించి ముంబై జట్టును ప్రకటించింది. ఇందులో పృథ్వీ షాకు చోటు దక్కలేదు. దీంతో ‘దేవుడా.. ఇంకెన్ని పరుగులు సాధించాలి’ అంటూ తన లిస్ట్ ఎ క్రికెట్ గణాంకాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ‘లిస్ట్ ఎ క్రికెట్లో 65 ఇన్నింగ్స్‌ల్లో 55.7 సగటుతో 3399 పరుగులు చేశా. నన్ను ఎంపిక చేయడానికి ఈ గణాంకాలు సరిపోవు. నేను తప్పకుండా తిరిగి వస్తాను’ అని పోస్ట్ పెట్టాడు.