టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ ఛతేశ్వర్ పుజారా చరిత్ర సృష్టించాడు. రంజీలో సౌరాష్ట్ర తరపున ఆడుతూ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 66 సెంచరీలు చేశాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ఫస్ట్ క్లాస్ సెంచరీల రికార్డ్‌ను అధిగమించాడు. ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీ బాది ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (81), సునీల్ గవాస్కర్ (81) సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నారు.