బీఆర్ఎస్ భవన్‌లో మహారాష్ట్ర నేతలతో కేసీఆర్(KCR) సమావేశం సందర్భంగా ఆ రాష్ట్ర అభివృద్దిపై ప్రతి పక్షాలు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణతో పొలిస్తే మహారాష్ట్రా వెనకబడింది అన్నారు. ఈ మాటలపై ప్రతిపక్షాలు విమర్షలు గుప్పిస్తున్నారు. ముందు తెలంగాణలో జరిగిన అభివృద్ధి పనులేంటో చెప్పమని నిలదీస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వంపై..ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం(No confidence motion) ఎందుకు ప్రవేశపెట్టింది? అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా ఇండియా కూటమి ఏం సాధిద్దామని అనుకుంటుంది? పార్లమెంట్‌లో జరిగే చర్చలో ఎటువంటి వ్యూహంతో వ్యవహరించనుంది? లోక్‌సభ సభ్యత్వం తిరిగి పొందిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ చర్చలో బీజేపీపై విరుచుకపడనున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
బెంగళూరులో ట్రాఫిక్ మూలంగా ఏడాదికి వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుంది. దీనిపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరిని డీకే శివకుమార్ కలిశారు. హైదరాబాద్ కూడా ఈ సమస్యకు అతి చేరువలో ఉందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
రోడ్డుపై స్పీడ్‌గా వెళుతోన్న కారు నడుపుతున్న వ్యక్తి.. ముందట ఏర్పడిన గొయ్యిని గమనించలేదు. దీంతో కారు ఆ గొయ్యిలో పడిపోయింది. ఈ ఘటన చైనాలో గల హీలాంగ్జియాంగ్ వద్ద జరిగింది.
స్పేస్‌లో కూడా ట్రాఫిక్ జామ్ అవుతోంది. అవును.. అంతరిక్ష ప్రయోగాలతో అక్కడ వ్యర్థాలు భారీగా పేరుకుంటున్నాయి. మెజార్టీ అమెరికా, రష్యా, చైనాకు చెందిన వ్యర్థాలు ఉన్నాయని ఇస్రో చెబుతోంది.
ఓ టూవీలర్‌ను తప్పించే ప్రయత్నంలో కంటైనర్ బోల్తా పడింది. హారన్ కొట్టినప్పటికీ టూ వీలర్ రైట్ వైపునకు రాగా.. కంటైనర్ డివైడర్ మీదకు తీసుకెళ్లాడు డ్రైవర్ రషీద్. దీంతో టూ వీలర్ మీద ఉన్న ముగ్గురు ప్రాణాలతో బతికి బయటపడ్డారు.
టీటీడీ చైర్మన్ నియామకం వివాదాస్పదమైంది. భూమన కరుణాకర్ రెడ్డి అన్యమతస్తుడు అని.. ఆయనను చైర్మన్ పదవీ నుంచి తప్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని హిందూ సంస్థలు, భక్తులు కోరుతున్నారు.
ప్రజా యుద్ధనౌక, గాయకుడు గద్దర్ అసలు పేరు తెలుసా? ఇతని అసలు పేరు గుమ్మడి విట్టల్ రావు. ఇతను తెలుగు సంస్కృతిని ప్రోత్సహించడంలో ప్రసిద్ధి చెందాడు. దీంతోపాటు తన గురించి మరికొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఓ 50 ఏళ్ల వ్యక్తి రూట్ కెనాల్ డెంటల్ ట్రీట్ మెంట్(Dental treatment) కోసం ఓ ఆస్పత్రి(hospital)కి వెళ్లగా వారు నిర్లక్ష్యంగా వైద్యం(treatment) చేశారు. కానీ అది అతనికి తెలియకపోవడంతో దాదాపు 6 నెలలు నరకం అనుభవించాడు. ఆ తర్వాత తెలుసుకన్న బాధితుడు ఆస్పత్రిపై కేసు వేశాడు. దీంతో కోర్టు ఆస్పత్రిపై జరిమానా విధించింది.
చెప్పేవి శ్రీరంగనీతులు.. కానీ చేసేవి మాత్రం అందుకు విరుద్దం అంటున్నారు తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అమ్మొద్దని ప్లకార్డు పట్టుకొని కేటీఆర్ ఆందోళన చేసిన పిక్ ఒకటి షేర్ చేశారు.
ఫ్రీ గిప్ట్ అంటే చాలు జనం ఎగబడుతుంటారు. అగ్రరాజ్యం అమెరికాలో కూడా అంతే.. ఓ యూట్యూబర్ గిప్ట్స్ ఇస్తామని ప్రకటిస్తే రోడ్డు మీద అభిమానులు బారులు తీరారు.
ప్రియుడి మోజులో భర్త చంద్రశేఖర్‌ను హతమార్చింది భార్య భువనేశ్వరి. హత్య చేసి.. తనకు ఏమీ ఎరగనట్టు పోలీసులకు ఫోన్ చేసింది. సందేహాం కలిగి విచారిస్తే.. అసలు నిజం తెలిసింది.
పుంగనూర్ ఘర్షణలు కుప్పానికి పాకాయి. అక్కడ ఆర్టీసీ బస్సును వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశారని తెలిసింది. బస్సుపై దాడి జరిగిన సమయంలో అందులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.
విజయవాడ-గూడూరు సెక్షన్(Vijayawada Gudur section) పరిధిలో ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో మనుబోలు, గూడూరు స్టేషన్‌ల మధ్య మూడో లైన్ పనులు కొనసాగనున్ననేపథ్యంలో ఆగస్టు 10 నుంచి 15 వరకు పలు ట్రైన్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఏకంగా ఆలయ భూములపై కన్నేశారు. అంతటితో ఆగకుండా తన పేరు మీద చేయించుకొని దేవుడికే అన్యాయం చేశారు. ఈ విషయం కోర్టుకు చేరడంతో ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.