YS Sharmila: దాచినా దాగదు.. బీఆర్ఎస్, బీజేపీ మైత్రి అని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) విమర్శించారు. వారిది గల్లీలో సిగపట్లు, ఢిల్లీలో కౌగిలింతలు.. నిజం కాదని నిరూపించగలరా? అని ప్రశ్నించారు. బీహార్లో జరిగిన బీజేపీయేతర పక్షాల సమావేశానికి ఆహ్వానం ఎందుకు అందలేదో చెప్పే దమ్ముందా అని అడిగారు. బీజేపీపై కేసీఆర్ తీరు సరిగా లేదని బీహార్ సీఎం నితీష్ కుమార్ చెప్పారని వివరించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని శరద్ పవార్ అన్నారని వివరించారు. ఇంకా నాటకాలు ఎందుకు అని షర్మిల (YS Sharmila) అడిగారు. తమిళనాడు మాజీమంత్రిని ఎంత రాక్షసంగా అరెస్టు చేశారో చూశాం అని.. బలమైన సాక్షాలున్నా కవితను ఆఫీసుల చుట్టూ తిప్పిన సీబీఐ, ఎందుకు అరెస్ట్ చేయలేదని షర్మిల అడిగారు. జాబితాలో ఆమె పేరే ఉండకపోవడం ఏంటో..? కవిత కడిగిన ముత్యమా, మీకు కుదిరిన బంధమా? అని నిలదీశారు.
తెలంగాణ మంత్రుల మీద ఈడీ దాడులు చేస్తారు. అరెస్టులు ఉండవని షర్మిల వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద నిరంతరం పోరాటం చేస్తున్నానని షర్మిల గుర్తుచేశారు. బీజేపీ నేతలు పనికిమాలిన ప్రకటనలు చేస్తారు తప్ప చర్యలు ఉండవన్నారు. కేసీఆర్ బీజేపీని పెద్దమనసుతో క్షమించేసి సభాముఖంగా దాడులు చేయడం బంద్ చేస్తారని గుర్తుచేశారు. కుమారుడు (చిన్న దొర) ఆగమేఘాల మీద ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలుస్తాడని వివరించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన సీఎంలు నెలల తరబడి ఎదురుచూస్తున్నా దొరకని అపాయింట్ మెంట్.. గాలికంటే వేగంగా ఈయనకు దొరుకుతుందని వివరించారు. సిగ్గులేకుండా, ఆత్మ చంపుకుని చేతులు కలుపుతున్న వీరి నీచక్రీడలను నాలుగు కోట్ల ప్రజలు గమనిస్తున్నారని షర్మిల అన్నారు. వీరి స్నేహ బంధాన్ని త్వరలో బొందపెడతారని తెలిపారు.
కుళ్లు కాయలను బంగారు సంచిలో దాచినా కంపు బయటపడదా ఏంటి.. అలాగే ఉంది.. భారాస, భాజపాల అక్రమ మైత్రి. ఎంతదాచినా దాగదులే అన్నట్టు… గల్లీలో సిగపట్లు, ఢిల్లీలో కౌగిలింతలు.. నిజం కాదని నిరూపించగలరా? బీహార్ లో జరిగిన బీజేపీయేతర పక్షాల సమావేశానికి మీకు ఆహ్వానం ఎందుకు అందలేదో చెప్పే…
మరోవైపు షర్మిల (YS Sharmila) తన పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తుందనే ఊహాగానాలు గుప్పుమన్నాయి. వరసగా కాంగ్రెస్ నేతల భేటీలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. షర్మిల అయితే అదేం లేదని చెబుతోంది. వస్తోన్న ఊహాగానాలను కొట్టిపారేశారు.