రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా తెలంగాణలో చేపట్టనున్న హాథ్ సే హాథ్ జోడో అభియాన్ ప్రణాళిక-శిక్షణ కార్యక్రమం బుధవారం బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో జరిగింది. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలు తెలుగు తమ్ముళ్లను అసహనానికి గురి చేశాయట. సాధారణంగా ఓ పార్టీ నాయకుడిపై మరో పార్టీ నేత విమర్శలు సహజమే. కా...
సీఎం కేసీఆర్ కోసం తాము చావడానికైనా సిద్ధమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఉమ్మడి ఏపీలో ఏం చదువుకోని వారిని హెల్త్ మినిస్టర్లను చేశారని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అప్పట్లో అవగాహన లేని వారికి మంత్రి పదవులు ఇచ్చారని, కానీ ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని అంశాల మీద పట్టున్న వారికి పదవులు ఇస్తున్నారని అన్నారు. కేసీఆర్ ను జాతీయ స్థాయిలో ఎలా వస్తావని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస...
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ.5వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని… కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పైసా కూడా ఇవ్వలేదని ప్రచారం చేస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. లిక్కర్ స్కాం పై కూడా ఆయన స్పందించారు. లిక్కర్ కేసులోకి తెలంగాణ వాళ్ళను రమ్మని మేం పిలవలేదని అన్నారు. దర్యాప్తు జరుగుతుంటే కల్వకుంట్ల కుటుంబ సభ్యుల పేర్లు వచ్చాయని తెలిపారు. తెలంగాణ వ్యక్తుల కోసం దర్యాప్తు ప్రారంభం కాలేదని, ఢిల్లీ లిక...
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల 19 కొత్త SUVలను కొనుగోలు చేసింది. 19 టయోటా ఫార్యునర్ వెహికిల్స్‌లో నాలుగు బుల్లెట్ ప్రూఫ్, మరో రెండు వాహనాలు వీఐపీ సెక్యూరిటీలో భాగంగా జామర్స్ కలిగి ఉంటాయి. ఓ వైపు రాష్ట్రంలో ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కొత్త కాన్వాయ్ అది కూడా ఏకంగా 19 SUVలు కొనుగోలు చేయడం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జగన్ 2019లో అధ...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ విమర్శల వర్షం కురిపించాడు. చంద్రబాబుని హిట్లర్ తో పోల్చి దారుణంగా కామెంట్స్ చేశాడు. చంద్రబాబుకు ప్రజల ప్రాణాలు గడ్డిపోచతో సమానమని ఆరోపించారు. పబ్లిసిటీ కోసం జనాల ప్రాణాలు తీస్తారా అంటూ ప్రశ్నించారు. జనం ప్రాణాల కన్నా బాబుకు తన పాపులారిటీనే ముఖ్యమని రాంగోపాల్ వర్మ మండిపడ్డారు. తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. తన ట్వి...
ఓ వైపు మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉత్తరాంధ్రపై చేసిన వ్యాఖ్యలపై వాడివేడి చర్చ సాగుతుండగా, మరోవైపు ఓ రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి మెట్ట రామారావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలువురు ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం అంటూ నినదించారు. ఇటీవల ధర్మాన మాట్లాడుతూ… చంద్రబాబు అమరావతిలో భూములన్ని కొనేసి, మరో హైదరాబాద్ చేయాలని చూస్తున్నారని, దీనిని తాము అంగీకరించమని, అమరావతే రాజధానిగా ఉంటే విశాఖ రాజధానిగా ఉత్తరా...
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి 2023 సంవత్సరం ఎంతో కీలకం కానుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు క్యాలెండర్ ఏడాది(2023) అయిన ప్రస్తుత సంవత్సరంలో ఏకంగా 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో బీజేపీ, బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంటే సార్వత్రిక ఎన్నికల సమయంలో కమలం పార్టీకి కాస్త సానుకూలంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఏడాదిన్న...
దేశంలో యువకులను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకడం లేదు.. ఎందుకో తెలుసా? కారణం చెప్పారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్. ఆయన బుధవారం కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పెళ్లి వయస్సు వచ్చినప్పటికీ యువకులకు వధువులు దొరకడం లేదని, దీంతో సామాజిక సమస్యలు సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆయన పుణేలో జన్ జాగర్ యాత్ర ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు....
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి…. పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలిచారు. కుప్పం లో నిన్న చంద్రబాబు నాయుడుని పోలీసులు అడ్డుకోవడం పై పవన్ స్పందించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల గొంతు వినిపించకూడదు, ఆ పార్టీలు కార్యక్రమాలు నిర్వహించకూడదు అనే ఉద్దేశంతోనే జీవో నంబర్ 1 తీసుకొచ్చారని పవన్ మండిపడ్డారు. ఇలాంటి జీవో గతంలో ఉండి ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర...
తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ల అసంతృప్తికి ఫుల్‌స్టాప్ పడలేదా? అధిష్టానం చర్యలతో వారు కూల్ కాలేదా? పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మార్పుతో సంతృప్తిగా లేరా? రేవంత్ రెడ్డి తీరును వారు ఏమాత్రం జీర్ణించుకోవడం లేదా? ఇటీవల కొన్ని పార్టీ కార్యక్రమాలను చూస్తే కాంగ్రెస్‌లో అసంతృప్తి రాగానికి దాదాపు ఫుల్ స్టాప్ పడినట్లుగా కనిపించింది. బుధవారం భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా తెలంగాణలో చేపట్టనున్న హాథ్ సే హాథ్ జ...
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సీఎం జగన్ అన్నీ సిద్దం చేసుకుంటున్నారు. 175సీటు లక్ష్యంగా జగన్ కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో…. కొందరు అభ్యర్థులకు సీటు ఖరారు చేస్తున్నారు. తాజాగా… విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ ని ఖరారు చేశారు. ఈ మేరకు జగన్ ప్రకటన చేశారు. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా ఈ నియోజకవర్గంలో మాత్రం టీడీపీ నేత గద్దె రామ్మోహన్ విజయం సాధించ...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త రాగాలు పెరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సొంత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రోడ్లు వేయలేకపోతున్నామని, రోడ్లపై పడిన గుంతలు కూడా పూడ్చలేకపోతున్నామని, తాగేందుకు నీళ్లు లేవంటే కేంద్రం నిధులు ఇస్తుందని, అప్పటి నుండి నీళ్లు ఇస్తున్నట్లు చెప్పుకోవాల్సి వస్తోందని, కేంద్రం నిధులు ఇస్తుంటే మీరేం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నించే పరి...
గత కొంతకాలంగా బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ పార్టీ మారుతున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ వార్తలపై తాజాగా ఆయన స్పందించారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. అయితే… తమ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల.. ఆ పార్టీ తో భాగస్వామమ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన అన్నారు. అందుకే జనసేన నాయకులు తనకు టచ్ లో ఉంటారని పేర్కొన్న ఆయన తాను పార్టీ మారే ఉద...
చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆయన పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును కార్యకర్తలు వ్యతిరేకించడంతో.. లాఠీఛార్జ్ కూడా జరిగింది. కాగా… పోలీసులు వ్యవహరించిన తీరు పై చంద్రబాబు సైతం మండిపడ్డారు.మీ అంతు చూస్తానంటూ పోలీసులపై బెదిరింపులకు దిగారు. నిబంధనలు పాటించాల్సిందేనని బాబుకు పోలీసులు స్పష్టం చేయగా, నాకే రూల్స్ చెబుతారా అంటూ పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం వెళ్లగక...
చంద్రబాబు పర్యటన నేపథ్యంలో… ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పంలో హై టెన్షన్ నెలకొంది. ఇటీవల ఆయన రెండు రోడ్ షోలలో దాదాపు 11 మంది ప్రాణాలు కోల్పోవడంతో…రోడ్ షోలు, బహిరంగ సభలను రద్దు చేశారు. ఈ క్రమంలోనే అనుమతి లేకున్నా… ఆయన కుప్పం పర్యటనకు వెళ్తుండటంతో… ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. శాంతిపురం (మ) పెనుమాకులపల్లిలో చంద్రబాబు సభకు అనుమతి లేదన్న పోలీసులపై టీడీపీ నేతలు వాదులాటకు దిగార...