బీరుట్‌లోని హెజ్బొల్లా ఆర్థిక మూలాలపై ఇజ్రాయెల్ గురి పెట్టింది. ఆ ప్రాంతాలను లెబనీస్ పౌరులు ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో వందలాది మంది ప్రజలు బీరుట్ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. హెచ్చరిక అనంతరం ఇజ్రాయెల్ పలు చోట్ల పేలుళ్లు జరిపింది. భయంతో లెబనాన్ ప్రజలు మూకుమ్మడిగా వీధుల్లోకి రావడంతో ఒక్కసారిగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.