రైతులు ప్రతీ సీజన్లో రకరకాల పంటలను పండిస్తుంటారు. కానీ ఈ మధ్య కాలంలో రైతులు సీతాఫల పంటను ఎక్కువ పండిస్తున్నారు. ఎందుకంటే మిగతా పంటల కంటే ఈ పంటతో అధిక లాభం వస్తుంది. తెలియని పంటలు వేసి నష్టపోయే కన్నా ఈ మెుక్కను ఒక్కసారి నాటితే కొన్నేళ్లపాటు పండించవచ్చు. ఈ పంట ద్వారా సంవత్సరానికి రూ. 5 నుంచి రూ. 6 లక్షల ఆదాయం వస్తోందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ పళ్లకు మంచి డిమాండ్ ఉంది.