జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నాయకుడు ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆయనతో ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.