AP: సంక్రాంతి పండగలోగా రోడ్లపై గుంతలకు మరమ్మతులు పూర్తి చేస్తామని మంత్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. విజయనగరం జిల్లాలో సీఎం లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. కొత్త రోడ్లు, మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.350 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి రూ.220 కోట్లు మంజూరయ్యాయని, టెక్నాలజీ సాయంతో పూర్తయ్యేలా తిరుపతి ఐఐటీ, ఎస్ఆర్ఎం వర్సిటీలతో ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొన్నారు.