TG: రాష్ట్ర ప్రభుత్వం విద్యా కమిషన్ సలహా కమిటీని ఏర్పాటు చేసింది. ఆరుగురు సభ్యులతో కూడిన విద్యా కమిషన్ సలహా కమిటీని ఏర్పాటు చేయగా.. అందులో సభ్యులుగా ప్రొఫెసర్ హరగోపాల్, కేయూ విశ్రాంత ప్రొఫెసర్లు కే మురళీ మోహన్, కే వెంకట నారాయణ, శాతవాహన యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ ఎస్ సుజాత, ఎంవీ ఫౌండేషన్ కన్వీనర్ వెంకటరెడ్డి, యునిసెఫ్ విద్యా నిపుణుడు కేఎం శేషగిరి ఉన్నారు.