సైనికపరమైన రవాణా అవసరాలకు వినియోగించే విమానాల తయారీకి సంబంధించి దేశంలోనే తొలి యూనిట్ గుజరాత్లోని వడోదరలో ప్రారంభించబోతోంది. దీన్ని ఈనెల 28న ప్రధాని మోదీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ సంయుక్తంగా ప్రారంభించనున్నారు. స్పెయిన్కు చెందిన ఏరోస్పేస్ కంపెనీ ‘సీఏఎస్ఏ’, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ కలిసి వడోదర యూనిట్లో ‘సీ-295’ మోడల్ సైనిక విమానాలను తయారు చేయనున్నాయి.