భర్త సహకారంతో 50 మందికి పైగా పురుషులు తనపై అత్యాచారం చేశారని ఫ్రాన్స్ మహిళ న్యాయపోరాటం చేస్తోంది. డ్రగ్స్ ద్వారా ఎలాంటి లైంగిక నేరాలు జరుగుతున్నాయో తన కేసు ద్వారా సమాజం తెలుసుకోవాలని తెలిపింది. తనను స్పూర్తిగా తీసుకొని చాలా మంది బాధితులు ముందుకు రావాలని పిలుపునిచ్చింది. జరిగిన అన్యాయంపై వారంతా పోరాడేలా చేయాలనేది తన సంకల్పమని బాధితురాలు న్యాయస్థానంలో వెల్లడించింది.