TG: జన్వాడ రేవ్ పార్టీలో బడా నేతలు ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. పార్టీకి సంబంధించిన సీసీటీవీ విజువల్స్‌ను పబ్లిక్ డొమైన్లో పెట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా, ఈ పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యం, డ్రగ్స్ వినియోగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.